శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్థనః

వేదోవేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవిః        14   AUDIO

 

123

సర్వగః

అంతటను గమనము గలిగిన వాడు.  సర్వ వ్యాపకుడు.

124

సర్వవిద్భానుః

సర్వమును తెలిసినవాడు.

125

విష్వక్సేనః

తన తలంపు మాత్రము చేతనే సర్వదానవసైన్య సమూహములను నాశనము గావించువాడు.

126

జనార్థనః

తన్నాశ్రయించి ధర్మమార్గమున చరించువారిని కాపాడువాడు.

127

వేదః

జ్ఞాన భాండాగారము.

128

వేదవిత్

వేదసారమంతయును బాగుగా నెరిగినవాడు.

129

అవ్యంగః

జ్ఞానముచేత పరిపూర్ణుడైన వాడు.

130

వేదాంగః

వేదములే తన శరీరావయవములుగా గలిగిన వాడు.

131

వేదవిత్

వేదమును చక్కగా విచారణ చేయువాడు.

132

కవిః

సర్వజ్ఞమూర్తి.

FirstPreviousNextLastIndex

Slide 15 of 110