181
|
మహేష్వాసః
|
గొప్ప
విలుకాడు. కోదండము
ధరించి దుష్ట
సంహారము గావించిన
శ్రీరాముడు. మనస్సును
ఆవరించిన సమస్తపాతకములను
మనోనిగ్రహముతో
కూడిన ప్రణవోపాసనము
చేత నశించును.
|
182
|
మహీభర్తాః
|
ప్రళయసాగరములో
నున్న భూమిని
ఉద్ధరించినవాడు.
|
183
|
శ్రీనివాసః
|
శ్రీదేవికి
నిత్యనివాసుడైన
వాడు. శ్రీ(సంపద)నివాసుని
ఆశ్రయించినవారికి
సకల సంపదలు కలుగును.
|
184
|
సతాంగతిః
|
సత్పురుషులకు
గతియైన వాడు.
|
185
|
అనిరుద్ధః
|
ఆయనను
నిరోధింప గలవారెవ్వరూ
లేరు.
|
186
|
సురానందః
|
దేవతలకు
ఆనందము గూర్చువాడు.
|
187
|
గోవిందః
|
భూమియందలి
దుర్జనులను సంహరించి
ఆనందము కలుగజేయువాడు. గోపాలుడు.
మూగవానిచేత మాట
పలికించి ఆనందింపజేయువాడు.
|
188
|
గోవిదాం
పతిః
|
గోవిదులనగా
వేదవిదులు. వేదవిదులకు
పతియైనవాడు.
|