198
|
అమృత్యుః
|
మరణముగాని
నాశనముగాని లేనివాడు.
|
199
|
సర్వదృక్
|
సకల
భూతములందును
సర్యకాలముల యందును
కలుగుచున్న సకల
కార్యకలాపములను
చక్కగా దర్శించువాడు
పరమాత్మ.
|
200
|
సింహః
|
హింసించువాడు. దుర్మార్గులను
అవినీతిపరులను
నాశనము చేయువాడు.
|
201
|
సన్దాతాః
|
సమన్వయపరచువాడు. మానవులాచరించు
కర్మలను పరీక్షించి
వాటికి తగిన ఫలములను
సరిగా ప్రసాదించువాడు.
|
202
|
సన్దిమాన్
|
కర్మఫల
ప్రదాతయేకాక
జీవరూపుడై కర్మఫలముల
ననుభవించు వాడును
పరమాత్మయే.
|
203
|
స్థిరః
|
నిశ్చలుడు,
నిరాకారుడు, నిత్యుడు,
సర్వకాలములందు
ఏకరీతిగా నుండువాడు.
|
204
|
అజః
|
పుట్టుకలేనివాడు.
|
205
|
దుర్మర్షణః
|
జయించుటకుగాని
ఎదుర్కొనుటకుగాని
శక్యముగాని వాడు.
|
206
|
శాస్తా
|
శాసనకర్త
|
207
|
విశ్రుతాత్మా
|
విస్తరించిన
సమస్త సద్గుణములతో
భాసిల్లుచున్నవాడు.
|
208
|
సురారిహా
|
దేవతలకు
శత్రువులైన రాక్షసులను
సంహరించువాడు.
|