209
|
గురుః
|
ధర్మమార్గముని తెలిపి,
సంసారబంధమును
తొలగించుకొనుమార్గము
బోధించువాడు.
జగద్గురువు
భగవంతుడొక్కడే.
|
210
|
గురుతమః
|
గురువులలో సర్వశ్రేష్టుడు.
|
211
|
ధామః
|
1. యోగులకు జ్ఞానులకు
నిలయమైనవాడు,
గతియైనవాడు. 2. భగవంతుడు
జ్యోతిస్వరూపుడు.
|
212
|
సత్యః
|
అన్నికాలములందు మార్పులేని
పరబ్రహ్మస్వరూపము.
|
213
|
సత్యపరాక్రమః
|
అమోఘమైన దివ్యపరాక్రమముగలవాడు. సత్యస్వరూపుడేకాక
సత్యమును
ప్రవర్థిల్ల
చేయువాడు.
|
214
|
నిమిషః
|
యోగనిద్రయుండు శ్రీమహా
విష్ణువు.
|
215
|
అనిమిషః
|
నిరంతరము కన్నులు
తెరచియుండు
స్థితిగలవాడు.
సర్వమును
సదా గమనించుచు
నిత్య జాగ్రత్ స్వరూపుడు.
|
216
|
స్రగ్వీ
|
వాడనట్టియు దివ్యపరిమళభరితమగునట్టి
వైజయంతిమాలను
ధరించువాడైన
శ్రీహరి.
|
217
|
వాచస్పతి రుదారధీః
|
విద్యలకు పతియైనవాడు. సకల
విద్యాసారధియును,
జ్ఞానస్వరూపుడును
ఐన శ్రీమహావిష్ణువు.
|