శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః

సహస్ర మూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ః   24    AUDIO

 

218

అగ్రణీ

భగవంతుడు తాను ముందుగా నడచుచు ఆధ్యాత్మికసాధకులను గమ్యస్థానమునకు చేర్చువాడు.

219

గ్రామణీ

భూత సముదాయమున కెల్లవాటికిని నాయకుడైనవాడు.

220

శ్రీమాన్

శ్రీః అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద.  వీటితో కూడినవాడు శ్రీమాన్

221

న్యాయః

తర్కశాస్త్రము.

222

నేతా

నాయకుడు

223

సమీరణః

వాయు రూపమున  సమస్త ప్రాణులను చైతన్యవంతులుగా చేయువాడు.

224

సహస్రమూర్ధా

వేలకొలది శిరస్సులతో భాసించువాడు పరమాత్మ.

225

విశ్వాత్మా

నానారూపాత్మకమైయున్న ఈ విశాల విశ్వమంతయు భగవత్స్వరూపమే. విశ్వమునకంతకును ఆయనయే ఆత్మ.

226

సహస్రాక్షాః

వేలకొలది నేత్రములతో కూడినవాడు.

227

సహస్రపాత్

వేలకొలది పాదములతో విరాజిల్లువాడు.

FirstPreviousNextLastIndex

Slide 25 of 110