228
|
ఆవర్తనః
|
జననమరణ
క్లేశరూపమగు
సంసారచక్రమును
త్రిప్పువాడు.
|
229
|
నివృత్తాత్మాః
|
నిరంతరము
జీవులను సంసారచక్రములో
త్రిప్పువాడైనా, తాను మాత్రము
సంసారబంధనములకతీతుడై
వుండువాడు.
|
230
|
సంవృత;
|
కప్పబడియుండువాడు. (యోగమాయచేత
కప్పబడియున్నవాడు
కనుక తెలియబడనివాడు)
|
231
|
సంప్రమర్దనః
|
దుర్మార్గులను
పాపాత్ములను
వారివారి కర్మానుసారం
మర్దించి (శిక్షించి)
ధర్మమార్గములో
నడుపువాడు.
|
232
|
అహస్సంవర్తకః
|
సూర్యునిరూపమున
నుండి దినములను
చక్కగా ప్రవర్తింపచేయువాడు.
|
233
|
వహ్నిః
|
అగ్ని
హోత్రుడు.
|
234
|
అనిలః
|
వాయుదేవుడు. తనకొక ప్రత్యేక
నివాస స్థలమనునది
లేక యుండువాడు.
|
235
|
ధరణీధరః
|
ఆదిశేషుని
రూపమున ఆది వరాహ
రూపమున భూమిని
ధరించువాడు.
|