236
|
సుప్రసాదః
|
అనుగ్రహస్వరూపుడు.
|
237
|
ప్రసన్నాత్మా
|
ప్రసన్నమును
ప్రశాంతమును
నగు మనస్సుగల
వాడు.
|
238
|
విశ్వధృక్
|
అనంత
విశ్వమునంతను
ధారణ చేసినవాడు.
|
239
|
విశ్వభుక్
|
విశ్వమును
అనుభవించువాడు.
|
240
|
విభుః
|
నిత్యుడైనవాడు.
|
241
|
సత్కర్తా
|
సజ్జనులను
పుణ్యవర్తనులను
ఆదరించువాడు.
|
242
|
సత్కృతిః
|
పూజనీయులచేత
పూజించబడువాడు
శ్రీహరి.
|
243
|
సాధుః
|
సాధువర్తనుడు,
సదాచార సంపన్నుడు.
|
244
|
జహ్నుః
|
సంహారకాలమునందు
ప్రాణులను లయము
చేయువాడు.
|
245
|
నారాయణః
|
భక్తుల
కత్యంత ప్రియమైన
నామము. ప్రళయకాలమున
జీవులకందరకును
నిలయమయిన వాడు.
|
246
|
నరః
|
భక్తులను
పరమపదమునకు చక్కగా
నడిపించువాడు.
|