శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

వృషాహీ వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదరః

వర్దనో వర్దమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః              28  AUDIO

 

256

వృషాహీ

ధర్మము. యజ్ఞములయొక్క ఫలస్వరూపుడు.

257

వృషభః

ధర్మములను వర్తింపచేయువాడు. భక్తుల కోరికలను వర్తింపచేయువాడు.

258

విష్ణుః

సర్వవ్యాపకుడు.

259

వృషపర్వా

ధర్మమే సోపానముగా కలవాడు.

260

వృషోదరః

ధర్మములన్నియును తన గర్భమునందే గలిగియున్నవాడు. ధర్మస్వరూపుడు.

261

వర్దనః

అభివృద్ధి గలిగించువాడు.

262

వర్ధమానః

తనకుతానుగా అభివృద్ధి పొందినవాడు.

263

వివిక్తః

ఏకాంతముగా నుండువాడు.

264

శ్రుతిసాగరః

సకలశాస్త్రములును  నారాయణుని యందే జన్మించి నారాయణునినే బొందుచున్నవి.

FirstPreviousNextLastIndex

Slide 29 of 110