శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
ఇష్టోఌవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషోవృషః
క్రోధహా క్రోధకృత్ కర్తా విశ్వబాహుర్మహీధరః 34 AUDIO
308
ఇష్టః
పరమానందస్వరూపుడు – లోకమునందరికి ప్రియమైనవాడు.
309
అవిశిష్టః
సర్వాంతర్యామి. సర్వశ్రేష్టుడు.
310
శిష్టేష్టః
శిష్యులయందు ప్రేమగలవాడు.
311
శిఖండీ
నెమలిపింఛమును ధరించిన శ్రీకృష్ణుడు
312
నహుషః
మాయా బంధనముల చేత జీవులను బంధించువాడు ఈశ్వరుడు.
313
వృషః
ధర్మ స్వరూపుడు.
314
క్రోధహా
కోపమును పోగొట్టువాడు.
315
క్రోధకృత్కర్తా
సజ్జనుల కపకారము చేయు దుష్టుల పట్ల కోపము చూపువాడు.
316
విశ్వబాహు
అసంఖ్యాకములగు బాహువులు కలవాడు.
317
మహీధరః
భూమికి ఆధారమైన వాడు.
Slide 35 of 110