327
|
స్కందః
|
సుబ్రమణ్యస్వామి దేవతా సైన్యములకు
నాయకత్వము వహించినవాడు.
|
328
|
స్కందధరః
|
పతనావస్థ
యందున్న ధర్మమును
ఉద్ధరించువాడు
పరమాత్మ.
|
329
|
ధుర్యః
|
విశ్వసృష్టి, పాలనాది
కార్యములను తనంతట
తానే సమర్థతతో
వహించువాడు.
|
330
|
వరదః
|
తన్నాశ్రయించు
భక్తులకు వారి
వారి అర్హతలను
బట్టి కోరికలను
వర్షింపజేయువాడు.
|
331
|
వాయువాహనః
|
సర్వవిధములుగా
వున్న వాయువును
యథాక్రమముగా
సంచరించునట్లు
చేయువాడు.
|
332
|
వాసుదేవః
|
భక్తుల
కత్యంత ప్రియమైన
నామము. సమస్త భూతములందు
వసించువాడు. ప్రపంచమంతయు
పరమాత్మలోవుండుట, పరమాత్మ
ప్రపంచమంతటను
వుండుటచేత వాసుదేవుడు.
|
333
|
బృహద్భానుః
|
సూర్యచంద్రుల
యందు ప్రవేశించి
తన సహస్రకోటి
కిరణాలతో విశ్వమంతయును
ప్రకాశింపజేయువాడు.
|
334
|
ఆది
దేవః
|
అన్నిటికిని
ప్రప్రధముగా
నున్నవాడు.
|
335
|
పురన్దరః
|
స్థూల,
సూక్ష్మ, కారణ
శరీరములను పురములను
నాశనము చేయువాడు.
|