శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

పద్మనాభోఌరవిందాక్షః పద్మగర్భశ్శరీరభృత్ః

మహర్షి రృద్దో వృద్దాత్మా మహక్షోగరుడధ్వజః       38     AUDIO

 

346

పద్మనాభః

పద్మము నాభి యందు గలవాడు.

347

అరవిందాక్షః

తామరపువ్వులవంటి కన్నులు కలవాడు.

348

పద్మగర్భః

హృదయపద్మము యొక్క మధ్యభాగమునందు ధ్యానింపబడువాడు.

349

శరీరభృత్

తన మాయచేతనే వివిధ శరీరములను ధరించువాడు.

350

మహర్థిః

అనేక మహోన్నతములగు మహైశ్వర్య వైభవాది విభూతులు గలవాడు.

351

ఋద్ధః

తాను ఒక్కడే యైనను అనేక నామరూపాలతో విశ్వమంతా వ్యాపించినవాడు.

352

వృద్ధాత్మా

మిక్కిలి పురాతనుడు.

353

మహాక్షః

గొప్పనేత్రము గలవాడు.

354

గరుడధ్వజః

గరుడ చిహ్నముతో విలసిల్లు ధ్వజము గలవాడు.

FirstPreviousNextLastIndex

Slide 39 of 110