శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అతులశ్శరభో భీమ స్సమయజ్ఞో హవిర్హరిః

సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః       39     AUDIO

 

355

అతులః

సాటిలేనివాడు.

356

శరభః

నశించునట్టి శరీరములో నాశనము లేని ఆత్మ.

357

భీమః

దుర్మార్గుల పట్ల  భగవంతుడు భయంకరుడు.

358

సమయజ్ఞః

సమత్వమే భగవదారాధనముగా గలిగినవాడు.

359

హవిర్హరిః

భక్తులాచరించు యజ్ఞములందు హవిస్సులను స్వీకరించువాడు.

360

సర్వలక్షణ లక్షణ్యః

సర్వవిధములగు  లక్షణములచేత తెలుపబడినవాడు.

361

లక్ష్మీవాన్

లక్ష్మీ పతి. 

362

సమితింజయః

రాక్షసులతో యుద్ధములందు ఎల్లప్పుడూ విజయుడు.

FirstPreviousNextLastIndex

Slide 40 of 110