శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము
విక్షరో రోహితో మార్గోహేతుర్దామోదర సహః
మహీధరో మహాభాగో వేగవానమితా శనః 40 AUDIO
363
విక్షరః
క్షరమనగా నాశనమగునది.
364
రోహితః
మత్స్యావతారంలో భూమి నుద్ధరించిన విష్ణుమూర్తి.
365
మార్గః
మోక్షప్రాప్తికొరకు సాధకుడు ప్రవర్తించు మార్గములన్నియు భగవత్స్వరూపములే.
366
హేతుః
సృష్టికి హేతువు ఐనవాడు.
367
దామోదరః
దామము(తాడు)తో బంధింపబడిన బాలకృష్ణుడు. దమము(ఇంద్రియనిగ్రహము) మున్నగు సాధనములచేత పొందదగినవాడు.
368
సహః
గొప్పసహనశక్తి కలవాడు.
369
మహీధరః
భూమిని ధరించినవాడు.
370
మహాభాగః
గొప్పసౌందర్యనిధి. మహైశ్వర్యవంతుడు.
371
వేగవాన్
మిక్కిలి వేగముగా పయనించువాడు.
372
అమితాశనః
విశేషముగా భుజించువాడు.
Slide 41 of 110