405
|
వైకుంఠః
|
విరోధము
చేయువాడు. సృష్టి
యొక్క ప్రారంభమున
పంచభూతముల స్వేచ్ఛాగతులను
నిరోధించినవాడు. భక్తులు
అధర్మమార్గములో
పడకుండ నిరోధించువాడు.
|
406
|
పురుషః
|
శరీరమను
పురములో నివసించు
జీవుడు పురుషుడు.
|
407
|
ప్రాణః
|
ప్రాణ
రూపమున శరీరములో
వుండి చేష్టలు
కలిగించువాడు.
|
408
|
ప్రాణదః
|
సర్వప్రాణులకు
ప్రాణములిచ్చువాడు.
|
409
|
ప్రణవః
|
ఓంకార
స్వరూపుడు.
|
410
|
పృథుః
|
వ్యాపకుడు.
వివిధ నామరూపాలతో
విశ్వమంతా విస్తరించి,
విరాజిల్లువాడు.
|
411
|
హిరణ్యగర్భః
|
సృష్టికర్తయగు
బ్రహ్మ
|
412
|
శత్రుఘ్నః
|
తన్నాశ్రయించిన
భక్తుల మనస్సులలోని
అసుర శక్తులను
నాశనము చేయువాడు.
|
413
|
వ్యాప్తః
|
అంతటను
వ్యాపించినవాడు.
|
414
|
వాయుః
|
సర్వ
వ్యాపకుడు
|
415
|
అధోక్షజః
|
అంతర్ముఖములైన
ఇంద్రియములచేత
తెలియబడు వాడు
|