416
|
ఋతుః
|
భగవానుడు
ఋతువుల స్వరూపుడై
తానే ప్రవర్తిల్లుచున్నాడు.
|
417
|
సుదర్శనః
|
తన
భక్తులకు సులభముగా
దర్శన మిచ్చువాడు.
|
418
|
కాలః
|
కాలాతీతుడు. కాల స్వరూపుడు.
|
419
|
పరమేష్ఠీ
|
శ్రేష్టమగు
స్వకీయమగు మహిమచేత
హృదయాకాశమునందుండు
వాడు.
|
420
|
పరిగ్రహః
|
భక్తులు
ప్రీతితో సమర్పించిన
ఎంత చిన్న వస్తువునైనా
గ్రహించువాడు.
|
421
|
ఉగ్రః
|
దుష్టులకైనా, దుర్మార్గులకును
భగవానుడు భయంకరుడై
వారిని దండించువాడు.
|
422
|
సంవత్సరః
|
కాలమే
భగవత్స్వరూపము.
సకల భూతములకును
ఆయనయే నిలయమైనవాడు.
|
423
|
దక్షః
|
విశ్వము
యొక్క సృష్టి
-స్థితి
-లయములను మరియు సర్వకార్యములను
మిక్కిలి దక్షతతో నిర్వహించువాడు.
|
424
|
విశ్రామః
|
భక్తులకు
చక్కని విశ్రాంతి
స్థానమయినవాడు.
|
425
|
విశ్వదక్షిణః
|
సర్వసమర్థుడు
– సర్వశక్తి
భాండారము. సకల కర్మలు
తానొక్కడే దీక్షతో
నిర్వహించువాడు.
|