426
|
విస్తారః
|
ఒక్కడేయైన
పరమాత్మ అనేక
నామరూపములతో
విశ్వమంతయు రచించినవాడు.
|
427
|
స్థావర
స్థాణు
|
స్థిరుడైనవాడు. చలనరహితుడు. భగవానుడు
సర్వ వ్యాపియగుటచేత
చలనము బొందడు.
|
428
|
ప్రమాణమ్
|
సకలధర్మములకు
శాస్త్రములకు
జ్ఞానవిజ్ఞానములకు
నారాయణుడే ప్రమాణము
|
429
|
బీజమవ్యయం
|
సంసారవృక్షమునకు
నాశనములేని బీజ
స్వరూపుడు నారాయణుడే.
|
430
|
అర్థః
|
అందరిచేత
ఆరాధింపబడువాడు.
తన్నాశ్రయించినవారికి
వారివారి అర్హతలను
బట్టి కోరికలను
ఇచ్చువాడు.
|
431
|
అనర్థః
|
పొందవలసిన
కోరికలు లేనివాడు.
భగవానుడు పూర్ణుడు
పూర్ణకాముడు
పరిపూర్ణుడు.
|
432
|
మహాకోశః
|
పంచకోశములను
ఆవరణములుగా గలిగి
యున్నవాడు.
|
433
|
మహాభోగః
|
సుఖస్వరూపమగు
మహాభోగములు గలవాడు.
|
434
|
మహాధనః
|
గొప్ప
ధనవంతుడు. లక్ష్మీపతి.
|