435
|
అనిర్వణ్ణః
|
నిరాశ
నిర్వేదము అసంతృప్తి
లేనివాడు
|
436
|
స్థవిష్ఠః
|
విరాట్
రూపముతో సర్వమయుడై
వున్నవాడు.
|
437
|
అభూః
|
పుట్టుకయే
లేనివాడు.
|
438
|
ధర్మయూపః
|
భగవానుడు
ధర్మస్వరూపుడగుటచేత
ధర్మముచేతనే
బంధింపబడినవాడు.
|
439
|
మహామఖః
|
భగవంతుడు
యజ్ఞ స్వరూపుడు.
భగవంతుని యజ్ఞముల(నిష్కాముగా
చేయబడు పుణ్యకార్యములు)
చేత ఆరాధించవలెను.
|
440
|
నక్షత్రనేమిః
|
నక్షత్రములను
నడుపువాడు.
|
441
|
నక్షత్రీ
|
నక్షత్రములకు
రాజు.
|
442
|
క్షమః
|
క్షమ
(ఓర్పు లేక సహనము)
దైవ స్వరూపము.
|
443
|
క్షామః
|
తానెట్టి
మార్పులు వికారములు
పొందక నిరంతరము
ఒకేవిధముగా వుండువాడు.
|
444
|
సమీహనః
|
తాను
సృష్టించిన సకల
భూతములు సుఖశాంతులతో
నుండునట్లు తన
ఇచ్ఛాశక్తిని
ప్రవర్తింప చేయువాడు.
|