455
|
సువ్రతః
|
చక్కని
నియమములు, వాగ్దానములు,
ప్రతిజ్ఞలు గావించిన
పరమాత్మ
|
456
|
సుముఖః
|
సుందరమగు
ముఖము గలవాడు.
|
457
|
సూక్ష్మః
|
పరమాత్మ
సుక్ష్మాతి సూక్ష్ముడు.
సర్వాంతర్యామి.
|
458
|
సుఘోషః
|
సుందరమగు
మధురనాదము గలవాడు.
|
459
|
సుఖదః
|
తన భక్తులకు
సుఖములను ఇచ్చువాడు.
|
460
|
సుహృత్
|
ప్రత్యుపకారమును
కాంక్షించక పరులకుపకారమును
చేయువాడు. కరుణాసాగరుడు.
|
461
|
మనోహరః
|
మనస్సును
దొంగలించువాడు.
మనస్సు నశించునప్పుడే
మానవుడు మాధవుడగును.
|
462
|
జితక్రోధః
|
కోపమును
జయించినవాడు.
|
463
|
వీరబాహుః
|
శక్తివంతములగు
బాహువులు గలవాడు.
|
464
|
విదారణః
|
చీల్చి
చంపివేయువాడు.
నరసింహావతారుడు.
|