శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

స్వాపనః స్వవశోవ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వర              50     AUDIO

 

465

స్వాపనః

నిద్రపుచ్చువాడు. భగవానుడు తనమాయచేత సర్వలోకములను మోహితులగావించును.

466

స్వవశః

అనంతకోటి విశ్వములు ఆ భగవంతుని వశమునందే ప్రవర్తించును.

467

వ్యాపీ

కార్య కారణ రూపమున అంతటను వ్యాపించి విరాజిల్లువాడు.

468

నైకాత్మా

అనేక రూపములతో విస్తరించువాడు.

469

నైక కర్మ కృత్

విశ్వమునందుగల సమస్త కార్యకలాపములను తానొక్కడే చక్కగా నిర్వహించువాడు.

470

వత్సరః

సకలజీవులకు ఆధారమయినవాడు.  నిలయమయినవాడు.

471

వత్సలః

తల్లికి తమ బిడ్డలపై ఎంతటి వాత్సల్యముండునో భగవంతునికి తన భక్తులపై అంతకంటే ఎక్కువ వాత్సల్యముండును.   భక్తవత్సలుడు.

472

వత్సీ

విశ్వమందలి జనులందరును ఆయనకు వత్సములు (సంతానము) వంటివారు.

473

రత్నగర్భః

రత్న రాశులు తనయందు కలిగియున్నవాడు.

474

ధనేశ్వరః

ధనరాశులకు అధిపతి.

FirstPreviousNextLastIndex

Slide 51 of 110