538
|
మహావరాహః
|
ప్రళయ
సాగరములో మునిగిన
భూమిని ఉద్ధరించిన
వరాహావతారము.
|
539
|
గోవిందః
|
భూమి
యందలి దుర్జనులను
సంహరించి ఆనందము
కలుగజేయువాడు.
|
540
|
సుషేణః
|
గొప్ప
సైన్యము గలవాడు.
|
541
|
కనకాంగదీ
|
బంగారు
భుజకీర్తులతో
హస్తపాదాభరణములతో
అలంకరింపబడిన
వాడు.
|
542
|
గుహ్యః
|
హృదయగుహనందు
రహస్యముగా నుండువాడు.
|
543
|
గభీరః
|
జ్ఞాన
ఐశ్వర్య బల వీర్యాది
గుణములచే గంభీరుడై
వుండు వాడు.
|
544
|
గహనః
|
తేలికగా
లోనికి ప్రవేశింప
శక్యము కానివాడు.
|
545
|
గుప్తః
|
మనస్సు
చేత తెలియబడజాలని
వాడు.
|
546
|
చక్తగదాధరః
|
చక్రమును
గదను ధరించిన
మహా విష్ణువు.
|