శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

సుధన్వా ఖండ పరశుర్దారుణో ద్రవిణ ప్రదః

దివః స్పృక్సర్వ దృక్ వ్యాసో వాచస్పతి రయోనిజః          61        AUDIO

 

567

సుధన్వా

మంగళకరమగు ధనుస్సును ధరించిన వాడు. కోదండపాణి. శ్రీరాముడు.

568

ఖండపరశుః

శత్రువులను ఖండించునట్టి గొడ్డలి గలవాడు. పరశురాముడు.

569

దారుణః

దుర్మార్గులను శిక్షించువాడు.

570

ద్రవిణప్రదః

ధనమును ప్రసాదించువాడు.

571

దివస్పృక్

ఆకాశమును తాకు శరీరము గలవాడు. విశ్వరూపుడు.

572

సర్వదృగ్వ్యాసః

సకల విజ్ఞాన విశేషములను ప్రబోధము చేసినవాడైన వ్యాస భగవానుడు.

573

వాచస్పతిరయోనిజః

విద్యలకు అధిపతి వాచస్పతి. జననియందు జన్మలేనివాడు అయోనిజుడు.

FirstPreviousNextLastIndex

Slide 62 of 110