586
|
శుభాంగః
|
శుభప్రదములు,
మంగళకరములును
సుందరమగు అవయవములతో
కూడిన మహా
సౌందర్యమూర్తి
శ్రీహరి. సాకార పరబ్రహ్మ
ధ్యానము.
|
587
|
శాన్తిదః
|
చిత్త
శాంతిని ప్రసాదించువాడు.
|
588
|
స్రష్టా
|
సృష్టియొక్క
ప్రారంభమునందు
సకల భూతములను
సృష్టించినవాడు.
|
589
|
కుముదః
|
సమస్త
ప్రాణులకు ఆనందమును
కలిగించువాడు
శ్రీహరి.
|
590
|
కువలేశయః
|
జలములందు
శయనించియుండువాడు
శ్రీమన్నారణమూర్తి.
|
591
|
గోహితః
|
గోవులకు
హితము గలిగించువాడు.
|
592
|
గోపతిః
|
వేదములకు
కర్త. వాచస్పతి.
|
593
|
గోప్తా
|
సంరక్షకుడు.
|
594
|
వృషభాక్షః
|
ధర్మమే
నేత్రముగా గలిగినవాడు.
|
595
|
వృషప్రియః
|
ధర్మమునందు
ధర్మాత్ములయందును
మిగుల ప్రీతిగలవాడు.
|