596
|
అనివర్తీ
|
ధర్మపథమునుండి యెన్నడును
వెనుకంజ
వేయువాడు
కాడు.
|
597
|
నివృత్తాత్మా
|
విషయేంద్రియ భోగములనుండి
మరలినవాడు.
|
598
|
సంక్షేప్తా
|
ప్రళయకాలమందు సకల
భూతములను
తనయందే నుంచుకొనువాడు.
|
599
|
క్షేమకృత్
|
తన్ను సదా
సేవించు
భక్తులయొక్క
యోగక్షేమములను
చూచువాడు.
|
600
|
శివః
|
సకల పాపములను
నాశనము చేసి శుభములను
ప్రసాదించువాడు.
|
601
|
శ్రీవత్సవక్షా
|
భృగుమహర్షి పాదమును
భక్తితో
తన వక్ష
స్థలము నందు ధరించినవాడు.
|
602
|
శ్రీవాసః
|
లక్ష్మీదేవి నివాసము
గాగలిగినవాడు.
|
603
|
శ్రీపతిః
|
శ్రీ(పరాశక్తి)కి భర్తయై
జగన్నాటకము
నడుపువాడు.
|
604
|
శ్రీమతాంవరః
|
శ్రీమంతులలో శ్రేష్టుడు.
|