651
|
కామదేవః
|
అందరిచేతను
ప్రేమింపబడు
దేవుడు.
|
652
|
కామపాలః
|
కామములను
(కోరికలను) తీర్చువాడు.
|
653
|
కామీ
|
పూర్ణకాముడు.
సమస్తకామములును
సిద్ధించినవాడు.
వాంఛాతీతుడు.
|
654
|
కాన్తః
|
మిక్కిలి
సుందరమగు రూపముగలవాడు.
|
655
|
కృతాగమః
|
వేదశాస్ర్తాదుల
నిర్మాతయు ప్రబోధనుడును
పరమాత్మయే. స్వాధ్యాయ
యజ్ఞము వలన భగవత్ప్రాప్తి
కలుగును.
|
656
|
అనిర్దేశ్యవపుః
|
వర్ణించుటకు
వీలుకాని శరీరము
కలవాడు.
|
657
|
విష్ణుః
|
సర్వ
వ్యాపకుడు. సర్వాంతర్యామి.
|
658
|
వీరః
|
వీరత్వము
కలవాడు.
|
659
|
అనన్తః
|
దేశము
చేతను కాలము చేతను
వస్తువు చేతను
పరిచ్చేదము బొందనివాడు.
|
660
|
ధనంజయః
|
రాజసూయ
యజ్ఞములో దిగ్విజయము
సాధించిన అర్జునుడు.
|