679
|
స్తవ్యః
|
స్తవము
చేయదగినవాడు.
|
680
|
స్తవప్రియః
|
భక్తులు
ప్రేమతో ఎచ్చట
గానము చేయుచుందురో
అచ్చటనే భగవంతుడు
ఉండును.
|
681
|
స్తోత్రమ్
|
స్తుతిగీతములన్నియును
భగవత్స్వరూపములే.
|
682
|
స్తుతిః
|
స్తోత్రము
చేయుట. ప్రార్థన
చేయుట. వేదగానము,
గీతాగానము దైవస్వరూపములే.
|
683
|
స్తోతా
|
స్తోత్రము
చేయువాడు. భగవంతుని
నామకీర్తనము
చేయువారు భగవంతునితో
సమానులు.
|
684
|
రణప్రియః
|
యుద్ధము
చేయుటయే ప్రియమయినవాడు.
|
685
|
పూర్ణః
|
పరిపూర్ణుడు.
|
686
|
పూరయితా
|
భగవంతుడు
తాను పూర్ణుడగుట
మాత్రమేకాక తన్నాశ్రయించిన
వారందరిని పరిపూర్ణులను
చేయువాడు.
|
687
|
పుణ్యః
|
పవిత్రుడు.
సుఖస్వరూపుడు.
|
688
|
పుణ్యకీర్తిః
|
భగవానుని
దివ్యస్మరణ వలన
సకల పాపములు నశించి
సత్కీర్తి కలుగును.
|
689
|
అనామయః
|
రోగ
రహితుడు. శారీరక
మానసిక వ్యాధులకు
అతీతుడు.
|