శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

భూతవాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః

దర్పహా దర్పదోదృప్తో  దుర్దరోఌథాపరాజితః        76     AUDIO

 

708

భూతవాసః

 సత్పురుషులకు గతియగువాడు

709

వాసుదేవః

సమస్తభూతములలో వసించుచున్న దేవుడు.

710

సర్వాసునిలయః

సమస్తప్రాణులకు నిలయమైన వాడు.

711

అనలః

అపారమగు శక్తిగలవాడు.

712

దర్పహా

గర్వము మదము వంటి దుర్గుణములు గలవారి దర్పమును పోగొట్టువాడు.

713

దర్పదః

ధర్మమార్గమున నడచు సత్పురుషులకు గౌరవము-ప్రతిష్ట కలిగించువాడు.

714

దృప్తః

గర్వితుడు. సర్వసముడైన పరమేశ్వరుడు దుష్టజనుల గర్వమును అణచుటకు తాను గర్వితుడుగా ప్రవర్తించును.

715

దర్ధరః

భగవానునియొక్క తత్వమును ధారణము చేయుట చాల కష్టము.  అవ్యక్తమగు బ్రహ్మోపాసనము చాల కష్టముతో కూడియున్నది.

716

అపరాజితః

అపజయమెరుగని వాడు.

FirstPreviousNextLastIndex

Slide 77 of 110