725
|
ఏకః
|
The Only One. పరబ్రహ్మము
ఒక్కటియే గాని
రెండు మాత్రము
కాదు.
|
726
|
నైకః
|
Not one but Many. ఒక్కడే
యైనను తన మాయచేత
అనేక రూపములు
గలవానివలే గనిపించువాడు.
|
727
|
సవః
|
Sacrifice. వేదోక్తమగు
యజ్ఞము.
|
728
|
కః
|
Happiness. పరమాత్మ
ఆనంద స్వరూపుడు.
|
729
|
కిమ్
|
What. మనస్సును పరిశుద్ధము
చేసికొని అంతర్ముఖుడై ఏమిటి?
అను తత్వచింతన
వలననే పరబ్రహ్మము
సాధకునకు అనుభవసిద్ధమగును.
|
730
|
యత్
|
Which. దేని
(ఏది?) నుండి సకలభూతములు
పుట్టుచున్నవో
అదియే బ్రహ్మము.
|
731
|
తత్
|
That. అది. ఉన్నదంతా
పరబ్రహ్మమే.
|
732
|
పదమనుత్తమమ్
|
The unequalled state of perfection. సర్వశ్రేష్టమైన
దివ్యపదము. దీనికంటే
ఉన్నతమయిన పదము
మరియొకటి లేనే
లేదు.
|
733
|
లోకబంధుః
|
Friend of World. ఈ లోకమునకు
తండ్రి, తల్లి,
తాత, బంధువు పరబ్రహ్మమే.
|
734
|
లోకనాధః
|
Lord of the World. సర్వలోకములకు
అధిపతి శ్రీహరియే.
|
735
|
మాధవః
|
Lord of Lakshmi. లక్ష్మీపతి. ప్రకృతికి
అధిపతి.
|
736
|
భక్తవత్సలః
|
Lover of Devotees. తన్నాశ్రయించిన
భక్తుల పట్ల ప్రేమాదరణ,
వాత్సల్యములు
చూపువాడు.
|