శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః              80   AUDIO

 

747

అమానీ

Free from vanity.  అవిద్య. మాయ.

748

మానదః

Creator of delusion.  తన మాయ చేత ఆత్మేతర పదార్థములందు ఆత్మభావమును గలిగించువాడు.

749

మాన్యః

The honoured.  పూజ్యనీయుడు. స్తవనీయుడు. భగవంతుడు సర్వలోక శరణ్యుడు.

750

లోకస్వామీ

Lord of the Universe.  సర్వలోకములకు అధిపతి. ప్రభువు. పరిపాలకుడు.

751

త్రిలోకధృత్

Supporter of three worlds.  మూడు లోకములు (స్వర్గ, మర్త్య, పాతాళములు) ధారణ చేసినవాడు ఈశ్వరుడే.

752

సుమేధాః

Pure Intelligence.  గొప్ప మేధ గలవాడు.  తనయందుగల దైవత్వమును గుర్తించి దానిని వికసింప చేయుటయే సుమేధ.

753

మేధజః

Born of sacrifice.  యజ్ఞము నుండి పుట్టినవాడు.

754

ధన్యః

Fortunate.  కృతార్థుడు. కోరదగిన వాంఛలు లేనివాడు. పూర్ణకాముడు. పరిపూర్ణుడు.

755

సత్యమేధాః

Unfailing intelligence.  అకుంఠితమగు,  అద్భుతమగు మేధ (తెలివి) గలవాడు.

756

ధరాధరః

Supporter of the Earth.  ఈ ధారుణీ మండలము నంతను తన విభూతులతో ధరించినవాడు శ్రీహరి.

FirstPreviousNextLastIndex

Slide 81 of 110