శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః

చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద విదేకపాత్              82   AUDIO

 

765

చతుర్మూర్తిః

Four formed.  భగవంతుడు రూపరహితుడే అయినా నాలుగు యుగముల యందును నాలుగు రూపములతో మూర్తీభవించెను.

766

చతుర్భాహుః

Four handed.   నాలుగు భుజములతో విరాజిల్లిన పరమాత్మ చతుర్బాహు.

767

చతుర్వ్యూహః

Four centered.  నాలుగు వ్యూహములు కలిగినవాడు. 1. శరీరరూపుడగు పురుషుడు. 2. ఛందోరూపుడగు పురుషుడు. 3. వీరరూపుడగు పురుషుడు. 4. మహద్రూపుడగు పురుషుడు.

768

చతుర్గతిః

Goal of the four.  నాలుగు ఆశ్రమములవారికి గతియైనవాడు.

769

చతురాత్మా

Four minded.  చతుష్టయ స్వరూపుడు. 1. మనస్సు 2. బుద్ధి 3. చిత్తము. 4. అహంకారము.

770

చతుర్భావః

Source of the four.  ధర్మము, అర్థము, కామము, మోక్షము అనబడు చతుర్విధ పురుషార్థములకు శ్రీహరియే ఆధారుడు.

771

చతుర్వేదవిత్

Knower of  Vedas.  చతుర్వేదములను చక్కగా గ్రహించినవాడు.

772

ఏకపాత్

One footed.  సమస్త భూతములును భగవంతుని యొక్క ఒక్క అంశము మాత్రమే.

FirstPreviousNextLastIndex

Slide 83 of 110