835
|
అణుః
|
The subject. పరమాత్మ
సూక్ష్మాతి సూక్ష్ముడు.
|
836
|
బృహత్
|
The Greatest. అణురూపములో
వున్న పరమాత్మయే
విశ్వమంతా వ్యాపించెను
|
837
|
కృశః
|
The Leanest. మిక్కిలి
క్షీణించి సన్ననై
సున్నితమై కన్నులకు
కనబడని వాడు.
|
838
|
స్థూలః
|
The fatest. పరబ్రహ్మమే
విశ్వమంతయు వ్యాపించిన
స్థూల స్వరూపము.
|
839
|
గుణభృత్
|
With properties. గుణములు
లేని పరమాత్మ
రజోగుణముతో సృష్టిని,
సత్త్వగుణముతో
వృద్ధిని, తమోగుణముతో
లయమును చేయును.
|
840
|
నిర్గుణః
|
Without properties. పరమాత్మ
గుణరహితుడు.
|
841
|
మహాన్
|
The Mighty. మహనీయుడు.
|
842
|
అధృతః
|
Un-supported. సమస్త బ్రహ్మాండములను
ధరించునది పరబ్రహ్మము.
ఆయనను ధరించునది
ఏదియును లేదు.
|
843
|
స్వధృతః
|
Self-supported. అన్నిటిని
ధరించియున్నది
పరబ్రహ్మము. అట్టి బ్రహ్మమును
ధరించునది ఏది? తన మహిమనే
ఆధారముగా చేసికొని
యున్నది పరబ్రహ్మము.
|
844
|
స్వాస్యః
|
Of charming face. నిరాకారమైన
పరబ్రహ్మమే భక్తులకొరకు
సుందరముఖారవిందములతో
భాసిల్లువాడు.
|
845
|
ప్రాగ్వంశః
|
Of ancient ancestory. సనాతనమైన
వంశము గలవాడు.
(కనుక విశ్వమునకు
ఆదియైనవాడు)
|
846
|
వంశవర్ధనః
|
Multiplier of families. వంశమును
ఈ ప్రపంచమును
వృద్ధి పొందించువాడు.
|