876
|
విహాయ
సగతిః
|
ఆకాశమున
సంచరించు సూర్యభగవానుడు.
|
877
|
జ్యోతిః
|
పరమాత్మ స్వయం ప్రకాశుడు
|
878
|
సురుచిః
|
సుందరమైన
ప్రకాశము గలవాడు.
శోభనప్రదమైన
కోరిక గలవాడు.
|
879
|
హుతభుక్
|
యజ్ఞములందు
హోమము చేయు ద్రవ్యములను
స్వీకరించువాడు.
|
880
|
విభుః
|
విశ్వమంతయు
విస్తరించి విరాజిల్లి
వ్యాపించి సర్వమును
తానై యున్నవాడు.
|
881
|
రవిః
|
సూర్య
రూపమున రసములను
గ్రహించువాడు.
|
882
|
విరోచనః
|
భక్తులయొక్క
కోర్కెలనుసరించి
వారికి ప్రియమైన
రూపములో సాక్షాత్కరించువాడు.
|
883
|
సూర్యః
|
ఏ దివ్యశక్తినుండి
సమస్తమును జనించుచున్నదో
అట్టి శక్తినిధి
సూర్యుడు.
|
884
|
సవితా
|
నామరూపాత్మకమైన
జగత్తును సృష్టించుటకు
కారణమైన వాడు
శ్రీహరి.
|
885
|
రవిలోచనః
|
సూర్యుడే
నేత్రముగా గలవాడు.
|