886
|
అనన్తః
|
దేశము
చేతను కాలము చేతను
పరిచ్ఛేదము బొందనివాడు.
|
887
|
హుతభుక్
|
హోమద్రవ్యములు
స్వీకరించువాడు.
|
888
|
భోక్తా
|
అచేతనమైన
ప్రకృతికి భోక్త
అయినవాడు.
|
889
|
సుఖదః
|
తన్నాశ్రయించిన
భక్తులకు సమస్త
సుఖములను ప్రసాదించువాడు.
|
890
|
నైకజః
|
ఒక్క
పర్యాయమే పుట్టిన
వాడు కాడు. ధర్మ సంస్థాపనార్థము
అనేక పర్యాయములు
అవతరించిన వాడు.
|
891
|
అగ్రజః
|
అందరికన్నా
ముందు జన్మించినవాడు.
|
892
|
అనిర్విణ్ణః
|
నిరాశ,
నిర్వేదము, దుఃఖము
లేనివాడు.
|
893
|
సదామర్షీ
|
క్షమా
మూర్తి. తన భక్తులు
తెలిసికాని తెలియకకాని
చేసిన తప్పులు
క్షమించువాడు.
|
894
|
లోకాధిష్ఠానమ్
|
పరబ్రహ్మము
తాను ఎవ్వరిపైన
నాధారపడక నిరాధారుడై
అనంతకోటి బ్రహ్మాండములకెల్ల
ఆధారుడై వెలయుచున్నాడు.
|
895
|
అద్భుతః
|
భగవంతుడు
పరమాద్భుత మూర్తి.
|