896
|
సనాత్
|
భగవానుడు
అనాదిగా నున్నవాడు.
|
897
|
సనాతనతమః
|
సృష్టికర్తయగు
బ్రహ్మ సనాతనుడు.
|
898
|
కపిలః
|
సిద్ధులలో
కపిలుడను నేను.
|
899
|
కపిః
|
సూర్యకిరణములద్వారా
జలములను త్రాగువాడు.
|
900
|
అవ్యయః
|
ప్రళయకాలము
నందు సర్వమును
తనయందే యిముడ్చుకొనువాడు.
|
901
|
స్వస్తిదః
|
శుభములను
ప్రసాదించువాడు.
|
902
|
స్వస్తికృత్
|
సమస్త
శుభములను కలుగజేయువాడు.
|
903
|
స్వస్తి
|
పరమాత్మ
మంగళ స్వరూపుడు.
|
904
|
స్వస్తిభుక్
|
మంగళములను
శుభములను అనుభవించువాడు.
|
905
|
స్వస్తి
దక్షిణః
|
మంగళ
స్వరూపమున వృద్ధిపొందువాడు.
శుభదాతయై విస్తరిల్లువాడు.
|