950
|
ఆధారనిలయః
|
అఖిలాండ
బ్రహ్మాండకోటికి,
పంచభూతములకు,
సమస్తమునకు ఆధారమైనవాడు.
|
951
|
అధాతా
|
తనకు
వేరొక ఆధారము
లేనివాడు.
|
952
|
పుష్పహాసః
|
అవ్యక్తమగు
పరబ్రహ్మము మొగ్గ. ఈ విశ్వమంతయు, చక్కగా
పరిమళములతో మనోజ్ఞముగా
వికసించిన పుష్పము.
|
953
|
ప్రజాగరః
|
నిరంతరము
మేల్కొనియే యుండువాడు.
|
954
|
ఊర్ధ్వగః
|
ఉన్నతోన్నతముగ,
మహోన్నతముగ, మహోన్నతోన్నతుడై
యుండు వాడు పరమాత్మ.
|
955
|
సత్పథాచారః
|
ధర్మమార్గమునే
సంచరించువాడు.
|
956
|
ప్రాణదః
|
సకలజీవులకు
ప్రాణశక్తి ప్రదాత
శ్రీహరియే.
|
957
|
ప్రణవః
|
పరమాత్మ
వాచకమగు ఓంకారము, ప్రణవము.
|
958
|
పణః
|
మానవుల
కర్మలను పణము
(మూల్యము)గా
స్వీకరించి వారికి
తగినరీతిగా ఫలమును
ప్రసాదించువాడు.
|