శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మ మృత్యు జరాతిగః       103  AUDIO

 

959

ప్రమాణమ్

స్వయముగా జ్ఞాన ప్రమాణము పరమాత్మ.

960

ప్రాణనిలయః

సకల ప్రాణులకు నిలయము.

961

ప్రాణభృత్

అన్నరూపమున సకల జీవులను పోషించువాడు.

962

ప్రాణజీవనః

సకల భూతజీవజాలమునకు ఈశ్వరుడే జీవన దాత.

963

తత్త్వమ్

యథార్థమైన పరమసత్య స్వరూపుడు.

964

తత్త్వవిత్

స్వస్వరూపమును యథార్థముగా నెరిగినవాడు.

965

ఏకాత్మా

ఆత్మ ఒక్కటియై, ఏకమైయున్నందున ఏకాత్మా అనబడును.

966

జన్మ మృత్యు జరాతిగః

జననము, మరణము, వృద్ధత్వము లేనివాడు పరమాత్మ.

FirstPreviousNextLastIndex

Slide 104 of 110