967
|
భూర్భువస్స్వస్తరుః
|
భూలోకము,
భువర్లోకము, సువర్లోకము
అను మూడు లోకములయందు
వృక్ష రూపమున
వ్యాపించిన పరమాత్మ.
|
968
|
తారః
|
భయంకరమైన
సంసార సాగరము
నుండి మానవులను
తరింపచేయువాడు.
|
969
|
సవితా
|
లోకమునకంతకును
తండ్రియైన వాడు.
|
970
|
ప్రపితామహః
|
బ్రహ్మదేవునికి
కూడ తండ్రియైన
వాడు పరమాత్మ.
|
971
|
యజ్ఞః
|
యజ్ఞ
స్వరూపుడు.
|
972
|
యజ్ఞపతిః
|
సర్వ
యజ్ఞములకును,
భోక్త, ప్రభువు
అయివున్నవాడు.
|
973
|
యజ్వా
|
విధివిధానము
ననుసరించి యజ్ఞము
చేయువాడు.
|
974
|
యజ్ఞాంగః
|
యజ్ఞవరాహమూర్తికి
వేదములే పాదములుగా,
వేదాంగములు కర్ణాభరణములుగా,
ఇట్లు హరివంశములో
వర్ణింపబడి యున్నందున
శ్రీహరి యజ్ఞాంగః
అని భజించబడుచున్నాడు.
|
975
|
యజ్ఞవాహనః
|
ఫలదాయకంబగు
యజ్ఞములే వాహనముగా
కలవాడు.
|